Site icon TeluguMirchi.com

‘ఒంగోలుగిత్త’ కు గాయం

ongole-gittha-movieరామ్ – కృతి కర్బందా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఒంగోలుగిత్త’. ఇటీవల ఆడియో వేడుకను జరుపుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 1కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు కూడా జరిగాయి. అయితే అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల కాకపోవచ్చు అనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ షూటింగులో హీరో రామ్ గాయపడటమే అందుకు కారణమని తెలుస్తోంది. సినిమాలో మిగిలి ఉన్న కొన్ని ఫైట్ సీన్లను చిత్రీకరిస్తుండగా రామ్ కాలి మడమ భాగంలో గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో 4 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. రామ్ కి తగిలిన గాయం కారణంగా, మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కూడా మరింత ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది.

Exit mobile version