Site icon TeluguMirchi.com

రామ్ క్యారెక్టర్ అదిరిపోద్దట‌!

masalaబాలీవుడ్‌లో భారీ హిట్ న‌మోదు చేసుకొన్న చిత్రం బోల్‌బ‌చ్చన్‌. తెలుగులో మ‌సాలా పేరుతో రీమేక్ చేశారు. కె.విజ‌య‌భాస్కర్ ద‌ర్శకుడు. వెంక‌టేష్‌, రామ్ క‌థానాయ‌కులుగా న‌టించారు. త‌మ‌న్ బాణీలు అందించిన ఈ చిత్రంలోని గీతాలు ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో విడుద‌ల‌య్యాయి. న‌వంబ‌రు మొద‌టి వారంలో ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ అదిరిపోద్దట‌. వెంకీ కంటే రామ్ కే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయ‌ని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలో రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో క‌నిపించ‌నున్నాడు. రామ్ తేడా క్యారెక్టర్‌లో పండించే వినోద‌మే ఈ సినిమాకి ప్రధాన బ‌లం. షాడో తో వెంకీ, ఒంగోలు గిత్తల‌తో రామ్ భారీ ఫ్లాప్‌ల‌ను మూట‌గ‌ట్టుకొన్నారు. మ‌రోవైపు విజ‌య్‌బాస్కర్ కెరీర్ కూడా ఇప్పుడు అగ‌మ్య గోచ‌రంగా ఉంది. ఈ ద‌శ‌లో వ‌స్తున్న మ‌సాలా ఈ ముగ్గురి కెరీర్‌కీ చాలా కీల‌కం. మ‌రి ఈ రుచులు ఎలా ఉంటాయో..?

Exit mobile version