రామ్ గుండు కు కారణం..?

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో హిట్ అందుకున్న రామ్..తాజాగా తన లుక్ ను అందరికి షాక్ ఇచ్చాడు. పూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయ్యే టైం లో రామ్ అమెరికా వెళ్ళిపోయాడు. సినిమా రిలీజ్ అయినా రెండు వారాలకు ఇండియా కు తిరిగొచ్చాడు. వచ్చి రాగానే చిత్ర ప్రమోషన్ లలో క్యాప్ తో కనిపించి ఆశ్చర్య పరిచాడు. ఏదో సరికొత్త లుక్ తో రామ్ కనిపిస్తాడని అందరు అనుకున్నారు.

కానీ తన గుండు విషయాన్నీ తెలిపి అందరికి షాక్ ఇచ్చాడు. ఓ భిన్నమైన షర్ట్ ధరించి, ప్రెంచ్ గడ్డంలో గుండు చేయించుకొని కనిపించాడు. మైల్డ్ లీ వైల్డ్, వైల్డ్ లీ మైల్డ్ అనే ఓ ఆసక్తికర క్యాప్షన్ ఈ ఫోటోకి ట్యాగ్ చేశారు. మరి ఈ గుండు వెనుక రహస్యం ఏంటి..సినిమా హిట్ అయితే ఇలా గుండు చేయించుకుంటానని ఏమైనా కోరుకున్నాడా..అనేది తెలియాల్సి ఉంది.