Site icon TeluguMirchi.com

రామ్.. గన్ పట్టుకొని హల్చల్ చేసాడు..

ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో సూపర్ హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో రామ్..ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్లో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. కాగా తాజాగా రామ్ గన్ పట్టుకొని హల్చల్ చేసాడు.

రక్షణ దళాలు, పారామిలిటరీ దళాలు, వివిధ పోలీసు శాఖలకు గత 25 ఏళ్లుగా తుపాకులు, ఏకే 47 లాంటి ఆయుధాలను రూపొందించి సరఫరా చేసే జెన్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమానికి రామ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆ కార్యక్రమానికి హాజరైన రామ్ పలు గన్ లు తీసుకుని, అసలు ఎలా పట్టుకోవాలి, ఎలా గురి పెట్టాలి. ఎలా పేల్చాలి వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు.

Exit mobile version