ఉమెన్స్‌ డే : భార్యలందరు సన్నీలియోన్‌లా ఉండాలట!

ram gopal
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తనకు సంబంధం ఉన్నా లేకున్నా కూడా ఏదైనా ముఖ్యమైన విషయంపై తనదైన శైలిలో స్పందించి, వివాదాస్పదం అయ్యే వర్మ తాజాగా నేడు ఉమెన్స్‌ డే సందర్బంగా ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌లో ఆడవారిని అవమానించేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయి. పోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌ను పొగుడుతూ అందరు ఆడవాళ్లు కూడా సన్నీలియోన్‌ల తమ భర్తలకు సుఖాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా ట్వీట్‌లో పేర్కొన్నాడు.

మహిళలు అంటే ఎప్పుడు చిన్న చూపు చూసే వర్మ చేసిన ఈ ట్వీట్‌కు మహిళ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆడవారిని కేవలం సెక్స్‌ కోసమే అని భావించే వర్మ ఇంతకంటే గొప్పగా ఉమెన్స్‌ డే సందర్బంగా స్పందిస్తాడని తామేం ఊహించలేదని కొందరు మహిళలు అంటున్నారు. అయితే కొందరు మగాళ్లు మరియు ఆయన అభిమానులు మాత్రం ఆయన ట్వీట్‌ను సమర్ధిస్తున్నారు. ఆయన మహిళలను ఎక్కడ కించపర్చినట్లుగా మాట్లాడలేదని, అయితే ప్రతి మహిళ కూడా తమ భర్తకు సన్నీలియోన్‌లా సుఖం అందించాలని చెప్పాడు. అందులో ఎంత మాత్రం తప్పులేదని అంటున్నాడు. మొత్తానికి వర్మ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతుంది.