వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏది చేసిన పెద్ద సంచలనమే అవుతుంది. పలువురి మీద డైరెక్ట్‌గానే విమర్శలు చేసి తాను విమర్శల పాలయ్యే వర్మ ఇటీవలె వినాయకుడి మీద ఒట్టేసి ఇకపై ఎవరిని బాదపెట్టే విధంగా ట్వీట్లు చేయనని చెప్పాడు. ఇకపోతే ‘బాహుబలి 2’ చిత్రాన్ని చూశాక టీంను ఆకాశానికి ఎత్తేశాడు. ప్రభాస్‌ను అయితే కనబడకుండా ప్రశంసలతో ముంచెత్తాడు. తాజాగా వర్మ ‘బాహుబలి 2’ మత్తు నుండి తేరుకుని వేరే ట్వీట్లు మొదలెట్టాడు. తాను చచ్చిపోతే కచ్చితంగా నరకానికే వెళతానని వర్మ చెబుతున్నాడు.
నా జీవితం జర్నీలాంటిది అని, ప్రతిరోజు ఉదయం పుట్టి, రాత్రికి చనిపోతాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. ఈ 12గంటల్లోనే ఏది చేయాలనుకుంటానో అదే చేస్తా, తాను సంతోషంగా బతకడానికే అన్నీ చేస్తాను, తాను ట్విట్టర్ రాజుని కాదని అన్నాడు. ఇంకా చెప్పాలంటే తానో జోకర్ నని పేర్కొన్నాడు. చనిపోయాక ఎలాగు నరకానికే వెళతాను అందుకే బతికి ఉన్నన్ని రోజులు ఇక్కడే స్వర్గం వెతుక్కుంటూ హాయిగా బ్రతికేస్తాను, రేపటి గురించి నాకు ఆశ లేదు. ఈ రోజు మీదనే నా దృష్టి మొత్తం ఉంటుంది అని వర్మ విభిన్నంగా ట్వీట్లు చేశాడు.