Site icon TeluguMirchi.com

గుడ్ & బ్యాడ్ న్యూస్..

సినీ ప్రేక్షకులకు గుడ్ & బ్యాడ్ న్యూస్ ..ఎప్పుడు ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియా లో హాట్ టాపిక్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం తీసుకుని షాక్ ఇచ్చాడు. ఇక నుండి ట్విట్టర్ కు దూరంగా ఉంటానని , కేవలం ఇన్‌స్టాగ్రామ్‌ను మాత్రమే వాడుతానని వర్మ ట్వీట్‌ చేసి ట్విట్టర్ అభిమానులకు షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం ట్విట్టర్ తో సమానంగా ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతున్నారు కాబట్టి ఇక నుండి దాని ద్వారా తన భావాలను ఫొటోలు, వీడియోల రూపంలో వ్యక్తపరుస్తానని తెలిపారు. ఇన్నేళ్లు తనను ఫాలోచేసిన వారికి ధన్యవాదాలు చెప్పన్నారు. ఇదే తన చివరి ట్వీటని, పుట్టినరోజు: 7-5-2017, మరణం: 27-5-2017 అని వర్మ ట్వీట్‌ చేయడం మరింతగా చర్చ గా మారింది. ఎప్పుడు మాట మీద నిలబడని వర్మ ..ఈసారి మాత్రం నిలబడతాడా అంటూ కొంతమంది అంటున్నారు. చూద్దాం వర్మ కన్ను మళ్ళెప్పుడు ట్విట్టర్ ఫై పడుతుందా అని.

Exit mobile version