అర్థరాత్రి సమయంలో వర్మ వొడ్కాతో సరసమాడుతూ, ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ట్వీట్‌లు చేసే వర్మ ఇకపై ఎవరిని కించపరిచే విధంగా ట్వీట్ చేయడట. ఈయన కేవలం మనుషుల మీదనే కాకుండా దేవుళ్లపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవాడు. దాంతో భక్తులు కూడా వర్మను తిట్లతో ముంచెత్తెవారు.
తాజాగా వర్మ తాను బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్ వల్ల మారిపోయినట్టు ఇకపై ఎవరిపై కూడా విమర్శలు చేయను అని తన తల్లిమీద, అమితాబ్ బచ్చన్ మీద, దర్శకుడు స్పిల్‌బర్గ్ మీద ఒట్టేసి అవన్నీ మానేశాను అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా పవన్‌కళ్యాణ్ అభిమానులకు, గణపతి భక్తులకు కూడా క్షమాపణలు చెబుతున్నానని ట్వీట్ చేశాడు. గతంలో కూడా వర్మ ఇలాగే ఇకపై ట్వీట్‌లు చేయను అని చెప్పి ఎన్నో సార్లు చాలామందిని ఇష్టం వచ్చినట్టు విమర్శించిన విషయం తెలిసిందే.