రామ్ గోపాల్ వర్మ మరియు పూరి జగన్నాధ్ల మద్య ఉండే సన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు చాలా స్నేహంగా ఉంటారు. వర్మకు పూరి శిష్యుడు అనే విషయం తెల్సిందే. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం సక్సెస్ అవ్వడంతో రామ్ గోపాల్ వర్మ హడావుడి చేశాడు. మొదటి నుండి కూడా సినిమాపై చాలా నమ్మకంను వ్యక్తం చేస్తూ వచ్చిన వర్మ తాజాగా సినిమా విడుదలై సక్సెస్ అయిన నేపథ్యంలో పూరితో పాటు చిత్ర యూనిట్ సభ్యులను అభినందించాడు. చిత్ర యూనిట్ సభ్యులు ఏర్పాటు చేసిన పార్టీలో వర్మ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా పూరిని అభినందిస్తూ వర్మ ఘాటుగా ముద్దు కూడా పెట్టుకున్నాడు.
పూరిని రామ్ గోపాల్ వర్మ ముద్దు పెట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ నేపథ్యంలో వెంటనే సీక్వెల్ చేయాలంటూ కూడా పూరికి వర్మ సలహా ఇచ్చాడు. వర్మ మాటలను ఖచ్చితంగా పాటించి గురు భక్తిని కనబర్చే పూరి ఈసారి వర్మ చెప్పినట్లుగా సీక్వెల్ చేస్తాడో చూడాలి. పూరి జగన్నాధ్ తన శిష్యుడు అయినా కూడా వర్మ నిర్మొహమాటంగా మంచి సినిమాలను ఎప్పటికప్పుడు ప్రమోట్ చేస్తూనే ఉంటాడు. వర్మ పూరిల మద్య చాలా మంచి స్నేహం ఉందని అంతా అంటూ ఉంటారు. ఇక ఈ ఫొటోపై కొందరు వర్మకు కాస్త ఎక్కువ అయినట్లుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.