వర్మ ఈ చిత్రాన్ని పోర్న్ చిత్రంతో పోల్చాడు. దాంతో పవన్ అభిమానులు ఘోరంగా హర్ట్ అయ్యారు. పవన్‌కు వీర భక్తుడైన నిర్మాత బండ్ల గణేష్ కూడా వర్మ ట్వీట్లను చూసి చాలా ఫీల్ అయ్యాడు. అంతేకాకుండా బండ్ల గణేష్ ఆవేశంతో వర్మ ఒక మొరిగే కుక్క అంటూ సంబోదించాడు.
వర్మ నోట్లో నోరు పెట్టిన బండ్లకు వర్మ ఘాటు కౌంటర్ విసిరాడు. ప్రేక్షకులు ఎలా స్పందించినా కూడా చాలా లైట్ తీసుకునే వర్మ ఇండస్ట్రీకి చెందిన వారు తనను ఏదైనా అంటే మాత్రం వాటికి తగిన కౌంటర్తు విసురుతూ ప్రతీకారం తీర్చుకుంటాడు. బండ్ల గణేష్ తనను మొరిగే కుక్క అనడంతో మూతులు నాకే కుక్క కంటే మొరిగే కుక్క చాలా బెటర్, మొరిగే కుక్కకు కరవడం వచ్చు, కానీ మూతులు నాకే కుక్క ఇంట్లో ఉండే ఎలుకల కంటే కూడా హీనమైనది అంటూ పవన్ భక్తుడికి వర్మ ఘాటైన కౌంటర్ ఇచ్చాడు.