వర్మ క్షమాపణలు చెప్పాడోచ్‌..!

ram gopalవివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రతి విషయంలో కూడా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. తాజాగా నిన్న మహిళ దినోత్సవం సందర్బంగా ప్రతి మహిళ కూడా వారి భర్తలకు సన్నీలియోన్‌ మాదిరిగా సెక్స్‌ సుఖం ఇవ్వాలని, ఇదే తాను మహిళ దినోత్సం సందర్బంగా వారికి ఇస్తున్న సలహా అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. వర్మ చేసిన ట్వీట్స్‌ దాదాపు అన్ని కూడా వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. మిగిలిన వాటితో పోల్చితే ఈ ట్వీట్‌ మరింతగా వివాదాస్పదం అయ్యింది. దాంతో వర్మ దిగిరాక తప్పలేదు.

దర్శకుడు వర్మ ఎన్ని వివాదాలు వచ్చినా కూడా తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడు. కాని నిన్న చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు. నా మనస్సులో అనిపించిన అభిప్రాయాలను వ్యక్తం చేశాను ఆ అభిప్రాయానికి ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని వర్మ ట్వీట్‌ చేశాడు. వర్మ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్న మహిళలు పలు చోట్ల కేసులు పెట్టారు. కేసులతో టెన్షన్‌ ఎందుకు అని భావించిన వర్మ క్షమాపణలు చెప్పి వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆడవారిని చులకన చేస్తూ గతంలో పలు సార్లు కూడా వర్మ ట్వీట్స్‌ చేశాడు.