Site icon TeluguMirchi.com

ఏంటి వర్మ నీకేం కాలేదు కదా..! మరి ఎందుకిలా?

ram gopal varam naga babuవివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏ విషయంలో అయినా కూడా తనదైన రీతిలో ఎవ్వరిని పట్టించుకోకుండా నచ్చినట్టు ట్వీట్లు చేస్తూనే ఉంటాడు. అలాంటి వర్మ తాజాగా వింతగా ట్వీట్లు చేస్తున్నాడు. అందరికి సారీ చెబుతున్నాడు. అమ్మమీద, దర్శకుడు స్పిల్‌బర్గ్‌ మీద, అమితాబ్‌ బచ్చన్‌ మీద ఒట్టేసి ఇకపై ఎవరిని బాద పెట్టే విధంగా ట్వీట్లు చేయను అంటూ ట్వీట్‌ చేశాడు. ఇదంతా చూసి జనాలు అంతా షాక్‌ అవుతున్నారు. తాజాగా వర్మ మెగా బ్రదర్‌ నాగబాబుకు క్షమాపణలు చెప్పాడు. గతంలో చిరు వేడుకలో నాగబాబు వర్మపై కారు కూతలు కూయగా వర్మ కూడా నాగబాబుపై ఘాటుగా స్పందించాడు.

అప్పుడు జరిగిన పరిణామంకు వర్మ ఇప్పుడు నాగబాబుకు సారీ చెబుతున్నాడు. అంతేకాకుండా చిరంజీవి గారి లాంటి అన్నయ్య నాకుంటే నేనన్న మాటలకు కచ్చితంగా నేను కొట్టేవాడిని కాకపోతే నాగబాబు కేవలం నన్ను మాటలతోనే వదిలేశాడు, సారీ సార్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. వర్మ ఇలా చేసిన ట్వీట్‌ చూసి అంతా షాక్‌ అవుతున్నారు. ఏంటి వర్మ నీకేం కాలేదు కదా..!! ఇలా ఎందుకు ట్వీట్లు చేస్తున్నావు అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే వర్మ చేసిన ఈ ట్వీట్లు అన్నీ కూడా తెలుగులోనే ఉన్నాయి. గతంలో ఓ సారి మెగా కుటుంబానికి సారీ చెప్పిన వర్మ తను అసలు తెలుగులో ట్వీట్లు చేయను అని అన్నాడు. మరీ ఇప్పుడు తెలుగులో ఉన్న ట్వీట్లు నిజంగా వర్మ చేసినవేనా..?? అని అనుమానాలు వస్తున్నాయి.

Exit mobile version