వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గత రెండు మూడు రోజులుగా ‘కాటమరాయుడు’పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. పవన్ కాటమరాయుడు చిత్రాన్ని ఒక పోర్న్ సినిమాతో పోల్చిన వర్మపై తీవ్ర స్థాయిలో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. పవన్ ఫ్యాన్స్ వర్మను చంపేసి, ఆర్.ఐ.పీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని వర్మ మళ్లీ స్వయంగా పోస్ట్ చేసి పవన్ ఫ్యాన్స్‌ను మరింతగా ఉడికించాడు. ఇక తాజాగా మరోసారి ఇండైరెక్ట్‌గా కాటమరాయుడు సినిమాపై పడ్డాడు.
ఆ సినిమాను ఫ్యాన్స్ కూడా చూసేందుకు ఆసక్తి చూపడంలేదు. ఎందుకో ఇప్పుడే ఆ హీరో అభిమాన సంఘం అధ్యక్షుడు స్వయంగా చెప్పాడు. ఎందుకంటే ఈ సినిమా చేసే డబ్బులతో ‘బాహుబలి 2’ సినిమా చూడొచ్చు. అందుకే డబ్బులు దాచుకుంటున్నాం అని ఫ్యాన్స్ అంటున్నారు అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఇక్కడ కాటమరాయుడు పేరు ప్రస్థావించకుండానే వర్మ చేసిన ఈ ట్వీట్ మళ్లీ వివాదాస్పదం అయ్యింది. పవన్ ఫ్యాన్స్ మరోసారి వర్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.