Site icon TeluguMirchi.com

ప్రేమ కథలలోనే నటిస్తానంటున్న ఎనర్జిటిక్ హీరో..

ramఏ ఏజ్ కు తగ్గ చిత్రాలు ఆ ఏజ్ లోనే చేయాలంటారు సినీ పెద్దలు..అందుకే యాంగ్ హీరో లు ప్రేమ కథ చిత్రాలు చేస్తే ఎక్కువగా ఆదరిస్తారు..అలాకాదు యాక్షన్ సినిమాలే చేస్తాం అంటే జనాలు మాత్రం ఆ పక్క కూడా చూడడం లేదు..ఇప్పుడు ఇది బాగా గ్రహించాడు హీరో రామ్..

నేను శైలజ చిత్రం ముందు వరకు రకరకాల ప్రయోగాలు చేసి ఇతడి పని అయిపొయింది అనుకున్నారు..అలాంటి టైం లో ఓ చక్కటి ప్రేమ కథ తో నేను శైలజ గా వచ్చి సూపర్ హిట్ అందుకోవడమే కాదు తన కెరియర్ లోనే మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక రామ్ మనసు మార్చుకున్నాడు , ప్రేమ కథలే నటిస్తాడు అనుకున్నారు..కానీ హైపర్ అంటూ యాక్షన్ ఫిలిం తో వచ్చి మళ్లీ దెబ్బ తీసుకున్నాడు. దీంతో ఇక నుండి ప్రేమ కథ చిత్రాలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తా అంటున్నాడు ఈ యాంగ్ హీరో..చూద్దాం మళ్లీ ఎటువంటి చిత్రం తో వస్తాడో.

Exit mobile version