Site icon TeluguMirchi.com

రామ్‌ ఆ రీమేక్‌ను పక్కకు పెట్టేశాడా?

ఎనర్జిటిక్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో ఈ చిత్రం వసూళ్లు సాధిస్తుంది. రామ్‌ కెరీర్‌లోనేది ఇది బెస్ట్‌ కలెక్టెడ్‌ మూవీగా నిలుస్తుందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 75 కోట్లను ఈ చిత్రం వసూళ్లు చేసింది. ఇక రామ్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం తర్వాత తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘తడమ్‌’ అనే చిత్రాన్ని రీమేక్‌ చేయాలని భావించాడు. అయితే ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌తో ఆ సినిమాను వద్దనుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇస్మార్ట్‌ శంకర్‌లో మాస్‌ మసాలా పాత్రను చేసిన రామ్‌ ‘తడమ్‌’ చిత్రంలో పూర్తి విరుద్దమైన పాత్రను చేయాలనుకున్నాడు. అయితే మాస్‌ ఆడియన్స్‌ ఇంతగా తనను ఆధరిస్తున్న సమయంలో తడమ్‌ వంటి సినిమాను చేయడం కరెక్ట్‌ కాదని ఆయనే నిర్ణయానికి వచ్చాడట. ఆ విషయంపై కూడా క్లారిటీ వచ్చేసింది. స్రవంతి మూవీస్‌ వారు ఇప్పటికే తడమ్‌ మూవీ రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకున్నారు. కనుక దాన్ని ఎవరితో అయినా రీమేక్‌ చేస్తారేమో చూడాలి. లేదంటే కొంత కాలం తర్వాత అయినా తడమ్‌ను రామ్‌ తానే చేస్తాడేమో మరి.

Exit mobile version