కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు.. తమ ప్రియమైన వారితో సరదాగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా రామ్‌చరణ్ వంటింట్లో గరిట తిప్పారు. తన సతీమణి ఉపాసన కోసం రాత్రి భోజనాన్ని తయారు చేశారు. ఈ వీడియోను ఉపాసన ట్విటర్ వేదికగా నెట్టింట్లో పోస్ట్ చేసింది.
‘ నా కోసం చరణ్ డిన్నర్ తయారు చేస్తున్న వేళ. ఆయనే డిన్నర్‌ను సిద్ధం చేశారు. అలాగే డిన్నర్ పూర్తయ్యాక అంతా శుభ్రం చేశారు. మీకోసం ఎప్పుడూ శ్రమించే మీ భార్యలను ప్రేమగా చూసుకోవాల్సిన సమయమిది. ఆయనే నా హీరో కావడానికి కారణమిదే..!’ అని ట్వీట్ చేసింది ఉపాసన
When @AlwaysRamCharan cooks dinner for the Mrs. ?❤️
To all the husbands out there – he cooked dinner & also cleaned up after. Now that’s what makes him my hero ! ?? pic.twitter.com/HOK8N1B7vc— Upasana Konidela (@upasanakonidela) April 15, 2020