Site icon TeluguMirchi.com

చిట్టిబాబు ఫినిష్ చేశాడు

రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చరణ్‌ ‘చిట్టిబాబు’ పాత్రలో వినికిడిలోపం ఉన్న వ్యక్తిగా కనిపించనున్నారు.

ఈ సినిమాకు సంబంధించి చరణ్‌ షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ‘చిట్టిబాబు’ గెటప్‌లో ఉన్న చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను ఉపాసన పంచుకున్నారు. ‘‘చిట్టిబాబు’ షూటింగ్‌ పూర్తైంది. మార్చి 30న మీ స్పందన కోసం అతడు ఎదురుచూస్తున్నాడు’ అని ఆమె ట్వీట్‌లో వెల్లడించారు.

పల్లెటూరి నేపథ్యంలో 1985 నాటి కాలాన్ని తలపిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మార్చి 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.

Exit mobile version