రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో నటిస్తూనే చిరు 151వ చిత్రానికి నిర్మాతగా తన పనులు కానిస్తున్నాడు. సుకుమార్ చిత్రంలో చరణ్ చెవిటి వాడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత చెర్రీ ఎవరితో జతకడుతాడా..?? అనే మెగా అభిమానుల్లో ఆసక్తిగా మారింది. మొదటగా మణిరత్నం అనుకున్నారు. కానీ ఆ చిత్రానికి కాస్త టైం పట్టేలా ఉంది. తాజాగా బడా నిర్మాత దిల్ రాజుతో జత కట్టబోతున్నాడు అని తెలుస్తోంది. వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుంటున్న దిల్ రాజు ప్రస్తుతం ‘డీజే’, ‘ఫిదా’ చిత్రాలను నిర్మిస్తున్నాడు.
మెగా హీరోలతో జోరు మీదున్న దిల్‌రాజు త్వరలో చెర్రీతో మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇంతకుముందు ‘ఎవడు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కాంభో మరోసారి కూడా రావడానికి రెడీ అవుతోంది. దిల్‌రాజు చెర్రీకి తగ్గ కథను సిద్దం చేసి, ఇటీవలె చరణ్‌ను కలిశాడట. చెర్రీ కూడా కథ నచ్చడంతో వెంటనే ఒకే చేశాడని, సుకుమార్ చిత్రం తర్వాత వెంటనే దిల్‌రాజు, చరణ్‌ల చిత్రం మొదలవుతుందని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. దిల్ రాజుతో చెర్రీ జతకట్టబోతున్నాడు అనే విషయం మెగా అభిమానులను ఖుషీ చేస్తోంది.