సురేందర్ రెడ్డి చేస్తున్న పనిపట్ల చరణ్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఇద్దరి మద్య దూరంను పెంచుతున్నట్లుగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి సురేందర్ రెడ్డి పని విషయంలో మొదటి నుండి కూడా మెగా కాంపౌండ్ అసంతృప్తిగా ఉన్నారంటూ పుకార్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. కాని అలాంటిది ఏమీ లేదు అంటూ యూనిట్ సభ్యులు మొదటి నుండి కూడా చెబుతూనే ఉన్నాయి. సురేందర్ రెడ్డి కూడా ఈ వార్తలను కొట్టి పారేస్తున్నాడు. మెగా మూవీ అంటే కాస్త ఒత్తిడి ఉంటుంది. వారు వీరు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాంటివి సురేందర్ రెడ్డి కాస్త ఫీల్ అవుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ట్రైలర్ ఫైనల్‌గా ఏది ఫిక్స్ చేస్తారనేది చూడాలి.