‘సైరా’ ట్రైలర్‌ విషయంలో వివాదం

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. రామ్‌ చరణ్‌ ఈ చిత్రంను నిర్మిస్తున్నాడు. మొదటి నుండి కూడా ఈ చిత్రం డైరెక్టర్‌ విషయంలో ఏవో ఒక వార్త వస్తూనే ఉంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సురేందర్‌ రెడ్డికి పూర్తి స్వేచ్చ ఇవ్వనే లేదు. ప్రతి విషయంలో కూడా పరుచూరి బ్రదర్స్‌ సలహాలు ఇంకా పలువురి ఇన్వాల్వ్‌మెంట్‌ ఉందట. ఇక తాజాగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ చిత్రం కోసం ట్రైలర్‌ కట్‌ చేయించాడట. ఆ ట్రైలర్‌ పై రామ్‌ చరణ్‌ అసంతృప్తిని వ్యక్తం చేశాడని, దాంతో సురేందర్‌ రెడ్డి హర్ట్‌ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

సురేందర్‌ రెడ్డి చేస్తున్న పనిపట్ల చరణ్‌ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఇద్దరి మద్య దూరంను పెంచుతున్నట్లుగా ఉన్నాయంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. మొత్తానికి సురేందర్‌ రెడ్డి పని విషయంలో మొదటి నుండి కూడా మెగా కాంపౌండ్‌ అసంతృప్తిగా ఉన్నారంటూ పుకార్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. కాని అలాంటిది ఏమీ లేదు అంటూ యూనిట్‌ సభ్యులు మొదటి నుండి కూడా చెబుతూనే ఉన్నాయి. సురేందర్‌ రెడ్డి కూడా ఈ వార్తలను కొట్టి పారేస్తున్నాడు. మెగా మూవీ అంటే కాస్త ఒత్తిడి ఉంటుంది. వారు వీరు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాంటివి సురేందర్‌ రెడ్డి కాస్త ఫీల్‌ అవుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ట్రైలర్‌ ఫైనల్‌గా ఏది ఫిక్స్‌ చేస్తారనేది చూడాలి.