రామ్ చరణ్ బ్యానర్ లో రెండవ చిత్రంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు సిద్దం అయ్యింది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంను అక్టోబర్ మొదటి వారం లేదా రెండవ వారంలో విడుదల చేయబోతున్నారు. చిరంజీవి కోసం అత్యంత కష్టపడి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి అంటే దాదాపు రెండు సంవత్సరాలుగా సూరి కష్టపడుతూనే ఉన్నాడు.
ఆ కష్టంకు తుది ఫలితం రాబోతుంది. సైరా చిత్రం విడుదలకు సిద్దం అయిన నేపథ్యంలో దర్శకుడు సురేందర్ రెడ్డికి ఊహించని సర్ప్రైజ్ను నిర్మాత రామ్ చరణ్ ఇచ్చాడు. గత రెండేళ్లుగా కుటుంబంతో సమయం కూడా గపకుండా కష్టపడుతున్న సూరికి వారం రోజుల పాటు యూరప్ ట్రిప్‌ను బహుమానంగా ఇవ్వడం జరిగింది. ఈ విషయమై సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. సురేందర్ రెడ్డి కుటుంబం మొత్తం యూరప్ వెళ్లేందుకు రాను పోను టికెట్లు ఇంకా అక్కడ హోటల్ ఖర్చులు ఇతరత్ర ఖర్చులను చరణ్ ముందే భరించి బుకింగ్ చేయడం జరిగింది. అక్కడ టూర్ అంతా కూడా సురేందర్ రెడ్డి ఫ్యామిలీ ఎంజాయ్ చేసేలా నిర్మాత చరణ్ ప్లాన్ చేశాడు. అయితే సురేందర్ రెడ్డి సినిమా విడులయ్యాక వెళ్తాడా లేదంటే విడుదలకు ముందే వెళ్లి వస్తాడా అనేది చూడాలి.