రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రామ్ చరణ్ ..

Ram-charan-Srinu-vaitla-Movనిర్మాత దానయ్య డి.వి.వి. ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఈ రోజు (మార్చి 16) నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.

‘శ్రీను వైట్ల’ మాట్లాడుతూ ” ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ ‘ కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది” అన్నారు.

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ నేటి నుంచి హైదరాబాద్లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు.”నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.

అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు. రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీతి సింగ్ నటిస్తుంది. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.