చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను తెలుగుతో పాటు హిందీ, కన్నడం, తమిళం భాషల్లో విడుదల చేయబోతున్నారు. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను మెగా కాంపౌండ్ చేపట్టింది. తాజాగా బెంగళూరులో కన్నడ అభిమానుల కోసం మెగా వేడుక నిర్వహించారు. అక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ విషయంలో చరణ్ అండ్ టీం తక్కువ అంచనా వేశారు. భారీ ఎత్తున అభిమానులు రావడంతో కార్యక్రమం నిర్వహించిన ఆడిటోరియం సరిపోలేదు.
దాదాపు 40 శాతం మంది అభిమానులు ఆడిటోరియం బయట ఉండగా, లోనికి 60 శాతం మంది వెళ్లారు. బయట ఉన్న వారు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆడిటోరియం ఫుల్ అయ్యిందని నిలిపేయడం జరిగింది. మెగా అభిమానులు ఎంతో ఆసక్తితో ఆశగా చిరంజీవిని చూసేందుకు వస్తే బయట ఉంచాల్సి వచ్చిందని, అందుకు క్షమించాలంటూ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. మీ ప్రేమకు సంతోషం, మీ అభిమానం ఇలాగే ఉండాలనుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశాడు.