రామ్‌చరణ్ ఎప్పటి నుండో మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ఆశపడుతున్నాడు. కానీ ఇంతవరకు అది పట్టాలెక్కలేదు. త్వరలో ఈ కాంభో రాబోతుంది అని మెగా అభిమానులు కూడా భావించారు. కానీ చరణ్ ఇప్పుడు మణిరత్నం చిత్రంలో నటించాలనుకోవడం లేదు. ఆయన తాజాగా తెరకెక్కించిన ‘చెలియా’ చిత్రం ఫ్లాపయింది. దాంతో చరణ్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో చేసేది ఒక ప్రయోగం. వెంటనే మణిరత్నం దర్శకత్వంలో మరో ప్రయోగం చేస్తే రెండు బెడిసికొడితే కెరియర్‌కు పెద్ద దెబ్బ పడేలా ఉంది. అందుకే మణిరత్నంకు నో చెప్పి చెర్రీ మంచి పనే చేశాడు.
ఆయనకు నో చెప్పి చరణ్ మంచి పనే చేశాడు!
