స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్‌కు తావు ఇవ్వకుండా జక్కన్న ఆకట్టుకునే కథ, కథనంతో సినిమాను తీయాలని భావిస్తున్నాడు. అందుకోసమే ఈ చిత్రంలో కేవలం మూడు పాటలను మాత్రమే పెట్టాలని భావిస్తున్నారు. ఆ మూడు పాటలు కూడా చాలా సహజంగా, కథలో భాగం అయ్యి రాబోతున్నాయి. రొమాంటిక్ సాంగ్స్ ఇంకా లవ్ సాంగ్స్ ఉండకుండానే ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. 400 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.