Site icon TeluguMirchi.com

ఆగష్టు లో మొదలెడతారు!

ram-charan-koratala-siva-moరామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ అయింది. ఆగష్టు 22 నుండి ఈ చిత్రంకు రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ….రామ్ చరణ్‌ను గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. చరణ్ సరసన కేథరిన్ త్రెసా హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రానికి ‘టాప్ లేచిపోద్ది’, ‘హడల్’ అనే టైటిల్స్ పరిశీలనలో వున్నాయి. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పై భారీ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఎవడు’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

Exit mobile version