మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. హీరోగా సక్సెస్‌ను రుచి చూస్తునే నిర్మాతగా కూడా మంచి లాభాలను గడిస్తున్నాడు. మిగతా మెగా హీరోలు చెర్రీ కంటే కాస్త వెనుకబడి ఉన్నారనే చెప్పవచ్చు. అందుకు కారణం చెర్రీ మంచి కథలను ఎంపిక చేసుకోవడం. హీరో సక్సెస్ అంతా కూడా నటన, కష్టం మీద కాకుండా కథ మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మొదటి రెండు చిత్రాలతో పర్వాలేదనిపించుకున్నాడు. కానీ ఆ తర్వాత కథల విషయంలో ఆలోచించకుండా ఒకే చేసి ‘లోఫర్’, ‘మిస్టర్’ చిత్రాలతో ఫ్లాపులనే చవి చూశాడు. దాంతో తదుపరి చిత్రాన్ని హిట్ అయ్యే విధంగా ఎలాగైనా ప్లాన్ చేయాలని నాగబాబు భావించాడు.
వరుణ్ తేజ్ తదుపరి చిత్ర విషయంలో రామ్ చరణ్ దిగాడు. వరుణ్‌కు కథల ఎంపికలో మెలుకువలు తెలియడం లేదని, తమ్ముడికి సరిపోయే మంచి కథలను తయారుచేయమని ఇప్పటికే పలువురు దర్శకులకు చెర్రీ సందేశాలను పంపాడట. అవసరమైతే కథ నచ్చితే వరుణ్ తేజ్ తదుపరి చిత్రానికి తానే నిర్మాతగా వ్యవహరిస్తానని కూడా చెర్రీ మాట ఇచ్చాడట. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న వరుణ్ తేజ్‌కు ఎలాగైనా మంచి హిట్ ఇవ్వాలని, అందుకే మంచి కథను ఎంపిక చేయాలని చెర్రీ రంగంలోకి దిగినట్టు సమాచారం అందుతోంది.