మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగానే చిరంజీవి 152వ చిత్రంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిరు 152కు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు. గత ఏడాది కాలంగా చిరంజీవి డేట్ల కోసం కొరటాల శివ ఎదురు చూస్తున్నాడు. స్క్రిప్ట్‌ను పక్కాగా రెడీ చేసి పెట్టిన ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఈ చిత్రంను మరింత ఆకర్షనీయంగా మార్చేందుకు గాను చరణ్ కోసం ఒక గెస్ట్ రోల్‌ను క్రియేట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి స్క్రీన్ పై కనిపిస్తే బాక్స్‌లు బద్దలు కావడం ఖాయం. అందుకే చిరంజీవి సినిమాలో చరణ్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వారి కోరిక మేరకు చిరంజీవి సినిమాలో చరణ్ కోసం ఒక ప్రత్యేకమైన గెస్ట్ రోల్‌ను క్రియేట్ చేయాలని కొరటాల భావించాడు. అందుకు చరణ్ మరియు చిరు కూడా ఓకే చెప్పారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇంకా హీరోయిన్ ఎంపిక కాలేదు. త్వరలోనే హీరోయిన్ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.