జంజీర్ సినిమాలో రామ్‌చరణ్ పోలీస్ దుస్తుల్లో భలే పర్ఫెక్ట్గా సెట్టయిపోయాడు కదూ. ఆ బాడీ, బాడీ లాంగ్వేజ్ ఇవ్వన్నీ బాగా కుదిరాయ్. అయితే ఇందంతా తేలిగ్గా రాలేదు. రోజుకి నాలుగ్గంటలు జిమ్‌లోనే గడిపేవాడట. ఓ ఆస్ట్రేలియన్ ట్రైనర్ ని నియమించుకొని తన సలహాలూ, సూచనలూ పాటించాడట. అంతే కాదు, ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకొన్నాడట. అందుకే అతని బాడీ అంత పర్ఫెక్ట్గా కనిపిస్తోంది. దర్శకుడు అపూర్వ లఖియా ముందే చెప్పాడట. నువ్ నిజమైన పోలీస్‌లా కనిపించాలి. అందుకోసం చాలా కష్టపడాల్సివస్తుంది.. అని. దర్శకుడు చెప్పినట్టే చరణ్ – తీవ్రంగా శ్రమించి బాడీని షేప్ అప్ చేశాడు. అందుకే తెరపై నిజమైన పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమిస్తున్నాడు.