మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సి.ప్రతాప్ రెడ్డి మనువరాలైన ఉపాసనను ప్రేమించి 2012 జూన్‌లో వివాహం చేసుకున్నాడు. చరణ్‌ది ప్రేమ వివాహమే అయినా కూడా మొదట్లో ఈయన పెళ్లిపై చాలా విమర్శలు వచ్చాయి. అందుకు కారణం ఉపాసన కాస్త లావుగా ఉండడమే. దాంతో వీరిద్దరికి విభేదాలు వచ్చాయి అని పుకార్లు చెలరేగాయి. అందుకే ఉపాసన చాలా కష్టపడి డైట్ బాగా కంట్రోల్ చేసి నాజూగ్గా, హీరోయిన్ లాగా ముద్దుగా తయారయింది. ఇప్పుడే ఇలా స్నబడి అందంగా తయారయిన ఉపాసనకు అప్పుడే తల్లి అవాలని అస్సలు లేదు అని ఆమె ఓ సారి మీడియాతో చెప్పింది. తాజాగా ఉపాసన, చరణ్‌లకు త్వరలో వారసుడు రాబోతున్నాడు అని సోషల్ మీడియాలో పుకారు షికారు చేస్తోంది.
ఈ వార్తలు కాస్త మెగా కాంపౌండ్ దాకా చేరాయి. దాంతో ఇలా అయితే బాలేదు అని చరణ్ క్లారిటీ ఇచ్చేశాడు. తనకు ఇప్పుడే పిల్లలు వద్దని, అందుకు ఇంకా టైం ఉందని, ప్రస్తుతం ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాం అని, ఉపాసన తల్లి కాబోతుంది అని వార్తలు కేవలం గాలి వార్తలు మాత్రమే అని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను సినిమాలతో చాలా బిజీగా ఉన్నానని తండ్రి అవడం లేదు అని తేల్చి చెప్పాడు. దెబ్బకు మెగా అభిమానులు అయోమయం వీడిరది. ఆధునిక కాలంలో ఇదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఎవరో కొంచెం అలా భావిస్తే ఇక మీడియాలో ఆ వార్తలు చాలా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. మెగా వారసుడికి ఇంకా చాలా సమయం ఉందట.