బుధవారం రామ్‌చరణ్ జన్మదినం. ఈ సంబరాలను ఘనంగా జరుపుకోవాలని చరణ్ భావించారు. వేలాదిమంది అభిమానుల సమక్షంలో తుఫాన్, ఎవడు సినిమాల టీజర్లను విడుదల చేయాలని భావించాడు. అయితే… ప్రభుత్వం నుంచి అనుమతి లభింలేదు. పైగా జంజీర్లో నటించిన సంజయ్‌దత్ కష్టాల్లో ఉన్నాడు. జైలు జీవితాన్ని గడపబోతున్నాడు. ఈ సమయంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం భావ్యం కాదని చరణ్ భావిస్తున్నాడు. ఇటీవలే ముంబైలో సంజయ్‌ని కలసుకొని తన సంఘీభావం తెలియజేశాడు. అంతేకాదు… ఈ యేడాది పుట్టిన రోజు వేడుకలకూ దూరంగా ఉండబోతున్నాడు. బుధవారం ఎవడు టీజర్ విడుదల కాబోతోంది. ఈ కార్యక్రమంలో చరణ్ పాల్గొంటాడు.