‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో నటిస్తున్నందుకు గాను ఆ ఇద్దరు హీరోలు కూడా రూపాయి కూడా తేడా లేకుండా సమానంగా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా 25 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకోబోతున్నారు. గత చిత్రాలతో పోల్చితే వీరిద్దరు కూడా ఈ చిత్రంకు అధికంగానే తీసుకుంటున్నారు. ఇక రాజమౌళి పారితోషికం విషయంలో చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం రాజమౌళి 50 కోట్లు తీసుకుంటున్నాడు అంటూ కొందరు, 30 నుండి 40 కోట్ల వరకు తీసుకుంటున్నట్లుగా కొందరు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అయితే హీరోల కంటే కూడా అధికంగా రాజమౌళి తీసుకుని ఉంటాడు అంటున్నారు. పారితోషికాలకే 100 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.