‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం చరణ్‌, ఎన్టీఆర్‌ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. సుదీర్ఘ కాలం తర్వాత ఒక క్రేజీ మల్టీస్టారర్‌ తెలుగు ప్రేక్షకులముందుకు రాబోతుంది. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యం అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గాను హీరోలు రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు ఎంత తీసుకుంటున్నారు అనే విషయంపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటిస్తున్నందుకు గాను ఆ ఇద్దరు హీరోలు కూడా రూపాయి కూడా తేడా లేకుండా సమానంగా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా 25 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకోబోతున్నారు. గత చిత్రాలతో పోల్చితే వీరిద్దరు కూడా ఈ చిత్రంకు అధికంగానే తీసుకుంటున్నారు. ఇక రాజమౌళి పారితోషికం విషయంలో చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం రాజమౌళి 50 కోట్లు తీసుకుంటున్నాడు అంటూ కొందరు, 30 నుండి 40 కోట్ల వరకు తీసుకుంటున్నట్లుగా కొందరు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అయితే హీరోల కంటే కూడా అధికంగా రాజమౌళి తీసుకుని ఉంటాడు అంటున్నారు. పారితోషికాలకే 100 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.