Site icon TeluguMirchi.com

‘సైరా’ కేటీఆర్‌ పుకార్లను ఖండించిన చరణ్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ప్రతిష్మాత్మక చిత్రం ‘సైరా’ ప్రీ రిలీజ్‌ వేడుక సెప్టెంబర్‌ 18న ఎల్‌. బి స్టేడియంలో ఘనంగా జరుగనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అతిథిగా రాబోతున్నారు అనే వార్తలు తెగ ప్రచారం అవుతూ వస్తున్నాయి. ‘సైరా’కు కేటీఆర్‌ రాక హాట్‌ టాఫిక్‌గా మారింది. దాంతో ఈ విషయమై కొణిదెల ప్రొడక్షన్స్‌ క్లారిటీ వచ్చింది. ‘సైరా’పై వస్తున్న పుకార్లని చరణ్‌ కొట్టిపారేశారు.

‘సైరా’ వేడుకకు అతిథిగా కేటీఆర్‌ వస్తున్నారనే వార్తలు ఒట్టి పుకార్లే అని నిర్మాత రామ్‌చరణ్‌ ఆ వార్తలను ఖండించారు. పలు కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ఈ వేడుకకు రాలేకపోతున్నారని చరణ్‌ స్పష్టం చేశారు. స్వాతంత్య్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ చిత్రం తెరకెక్కింది. టాలీవుడ్‌ క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాగా ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నట్టుగా సమాచారం.

Exit mobile version