చరణ్ నిర్మించిన సైరా చిత్రంను హిందీలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు అక్కడ టీజర్ రిలీజ్ కార్యక్రమం చేశారు. ఈ సందర్బంగా చరణ్ మీడియాతో ముచ్చటించారు. ఎందుకు మీరు బాలీవుడ్లో నటించడం లేదు, హిందీ సినిమాలో నటించేందుకు మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటూ ప్రశ్నించిన సమయంలో నాకు హిందీలో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే హిందీలో మంచి కథతో నా వద్దకు ఎవరు కూడా రాలేదు. మంచి కథథో మంచి దర్శకుడు వస్తే తప్పకుండా మరోసారి హిందీలో నటిస్తానంటూ క్లారిటీ ఇచ్చాడు. మరి ఆ మంచి కథ చరణ్ వద్దకు అసలు వెళ్తుందో లేదో చూడాలి.