నా ‘ సూర్య ‘ బెస్ట్ అంటున్న రకుల్

అల్లు అర్జున్ – వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయినా చిత్రం నా పేరు సూర్య. మొదటి సారి అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా నటించడం , తన బాడీ లాగ్వేజ్ సైతం కొత్తగా ఉండడం , ట్రైలర్ ఆసక్తిగా కలిగించడం తో సినిమా ఫై భారీ అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు.

ఇక సినిమా ఇండస్ట్రీ సైతం ఈ మూవీ ఫై చాల ఆసక్తిగా ఉన్నారు. సమ్మర్ బరిలో వచ్చిన రంగస్థలం , భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్లు కావడమే కాదు కలెక్షన్ల వర్షం కురిపించడం తో నా పేరు సూర్య తో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యం లో హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్ సూర్య కు అల్ ది బెస్ట్ తెలిపింది.

‘ఆల్ ది బెస్ట్ మై ఫేవరేట్ బెస్ట్ పర్శన్ అల్లు అర్జున్.. మంచి అంచనాలతో రేపు ( మే 4) ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘నా పేరు సూర్య’ బిగ్గెస్ట్ హిట్ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ’ ట్వీట్ చేసింది రకుల్. అలాగే మంచు లక్ష్మి సైతం ‘సూర్య సూపర్బ్ లుక్స్‌తో అదరగొడుతున్నాడు… సూర్య చిత్ర యూనిట్‌కి నా బెస్ట్ విషెష్ అంటూ’ ట్వీట్ చేసింది.