రకుల్‌ ఆ హీరోతో డేటింగ్‌ చేయాలనుకుంటుంది

చిన్న చిత్రాలలో అప్పుడప్పుడే తళుక్కుమంటున్న సమయంలో పెద్ద హీరోల అవకాశాలు వరుసగా వచ్చి వరుస విజయాలు బుట్టలో పడ్డాయి. ఇక అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. నటనతో పాటు అందాన్ని ఆరబోయడానికి సైతం నో చెప్పని రకుల్‌కు అభిమానులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గోన్న రకుల్‌ను మీరు డేటింగ్‌ చేస్తే ఎవరితో చేస్తారు అని అడగ్గా రకుల్‌ ప్రేక్షకులతో పాటు యాంకర్‌కు కూడా దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చింది. సహజంగా వేరే హీరోయిన్‌లు ఛీ అలా కాదు, అది చెప్పలేం అంటుంటారు. కానీ రకుల్‌ టఫీమని హీరో పేరు చెప్పి షాకిచ్చింది.

నేను ఒకవేళ డేట్‌ చేస్తే నా డార్లింగ్‌ రణవీర్‌ సింగ్‌తోనే చేస్తాను, ఆయనతో డేట్‌ చేస్తే మజా ఉంటుంది అని షాకింగ్‌ సమాధానం చెప్పింది. తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోతున్న రకుల్‌ హిందీలో కూడా వరుస చిత్రాలను చేస్తోంది. అలాంటిది ఒక హిందీ హీరోతో డేటింగ్‌ చేయాలని ఉంది అని తేల్చి చెప్పింది. రకుల్‌ మాటలు విన్న తర్వాత డేట్‌ ఏమో కానీ రణవీర్‌ సినిమాలో అవకాశం వచ్చే ఛాయలు కనిపిస్తున్నాయి.