ఇక ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనుంది. మహేష్-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సమాంతరంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా మహేష్ ఇంటర్వ్యూ రేపు పత్రికలో రానుంది. ఆ ఇంటర్వ్యూలోనే రకుల్ క్యారెక్టర్ ఏంటనే విషయాన్ని మహేష్ బయటపెట్టాడు. అంతేకాదు, సినిమాకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ స్టిల్స్ కూడా రేపు వికటన్ పత్రికలో రాబోతున్నాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఏప్రిల్ 15 నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభంకాబోతోంది. ఎస్ జె సూర్య విలన్ రోల్ చేస్తుండగా , హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.