టాలీవుడ్లో దాదాపు యంగ్ హీరోల అందరితో కూడా కలిసి నటించిన అరుదైన రికార్డును రకుల్ ప్రీత్ సింగ్ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఈమె స్టార్‌గా హీరోయిన్గా కొనసాగింది. కాని ప్రస్తుతం ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు లేవు. బాలీవుడ్లో ప్రయత్నించినా కూడా అక్కడ ఫలితం దక్కలేదు. ఇక తాజాగా తమిళంలో సినిమాలు చేసినా అవి సక్సెస్ అవ్వడం లేదు. తెలుగులో కూడా ఈమెకు పెద్దగా ఆఫర్లు లేవు. ఇటీవల చేసిన మన్మధుడు 2 చిత్రం నిరాశ పర్చింది.
ఈ సమయంలోనే ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యింది. గతంలో ఈమె వద్దకు లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్‌లు వెళ్లాయి. కాని ఆ సమయంలో ఈ అమ్మడు హీరోయిన్గా బిజీగా ఉన్న కారణంగా వాటికి నో చెప్పింది. ఇప్పుడు ఆమె కావాలని ఈ చిత్రాలు చేయాలనుకుంటుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తాను, ఎవరైనా నాకు ఆఫర్ ఇవ్వండి అంటూ తెలిసిన వారి వద్ద కోరుతున్నట్లుగా తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ మరి కొన్ని రోజులు సక్సెస్ లేకుండా ఉంటే ఆమెను పట్టించుకునే వారు కరువవుతారు. మరి రకుల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేనా చూడాలి.