కెరియర్ మొదట్లోనే నాకు ప్రభాస్‌తో నటించే అవకాశం వచ్చింది. టెస్ట్ షూట్లు చేసి ఆ తర్వాత సెట్లోకి పిలిచి షూటింగ్లో కూడా పాల్గోనమన్నారు. నేను నాలుగు రోజుల పాటు షూట్లో పాల్గోన్నాక ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ నన్ను వద్దు అన్నారు. ఆ సమయంలో ఎందుకు వద్దన్నారో నాకు ఇప్పటికి తెలియదు. కానీ సెట్‌కి పిలిచి మరీ వద్దు అనడంతో చాలా బాద పడాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు జరిగాక కూడా ప్రస్తుతం నేను ఈ స్థితిలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. నన్ను అవమానించి వారు ఇప్పుడు భాదపడుతున్నారు. అయినా నేనేం అలాంటివి పట్టించుకోను, నా టాలెంట్‌ను గుర్తించిన వారే నాకు అవకాశాలు ఇస్తారు అని రకుల్ ధీమా వ్యక్తం చేసింది.