రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్‌బాబు, సాయిధరమ్ తేజ్ వంటి యువ అగ్ర కథానాయకులతో నటించి టాలీవుడ్ నెం.1గా ఓ వెలుగు వెలుగుతున్న రకుత్ ప్రీత్ సింగ్‌కు ఇప్పుడు తల కూడా తిప్పుకోకుండా అవకాశాలు ఉన్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది. అనంతరం మరికొన్ని చిత్రాలకు కూఆ ఇప్పటికే సంతకం కూడా పెట్టేసింది. నెం.1 హీరోయిన్గా చాలా బిజీ అయిన రకుల్‌ను గతంలో ప్రభాస్ ఒకసారి పిలిచి మరి అవమానించాడట. ప్రభాస్ అభిమాని ఒకరు మీరు ప్రభాస్‌తో ఎప్పుడు నటిస్తారు అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడట. దాంతో ఆ అభిమానికి రకుల్ క్లారిటీ ఇచ్చింది.
కెరియర్ మొదట్లోనే నాకు ప్రభాస్‌తో నటించే అవకాశం వచ్చింది. టెస్ట్ షూట్లు చేసి ఆ తర్వాత సెట్లోకి పిలిచి షూటింగ్లో కూడా పాల్గోనమన్నారు. నేను నాలుగు రోజుల పాటు షూట్లో పాల్గోన్నాక ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ నన్ను వద్దు అన్నారు. ఆ సమయంలో ఎందుకు వద్దన్నారో నాకు ఇప్పటికి తెలియదు. కానీ సెట్‌కి పిలిచి మరీ వద్దు అనడంతో చాలా బాద పడాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు జరిగాక కూడా ప్రస్తుతం నేను ఈ స్థితిలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. నన్ను అవమానించి వారు ఇప్పుడు భాదపడుతున్నారు. అయినా నేనేం అలాంటివి పట్టించుకోను, నా టాలెంట్‌ను గుర్తించిన వారే నాకు అవకాశాలు ఇస్తారు అని రకుల్ ధీమా వ్యక్తం చేసింది.