Site icon TeluguMirchi.com

హాట్రిక్ కొట్టిన బికిని ముద్దుగుమ్మ..

rakul-preet-successమంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన కరెంట్ తీగ చిత్రం నిన్న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను తెచ్చిపెడుతుంది. బి, సి సెంటర్లలో విజయాన్ని అందుకున్న ఈ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ హాట్రిక్ కొట్టింది. తెలుగు పరిశ్రమలో ‘వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ ‘ చిత్రం తో తెలుగు లో అరంగేట్రం చేసి మొదటి సినిమా తోనే సక్సెస్ రుచి చూసింది ఈ బికిని ముద్దు గుమ్మ.

జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తప్పితే లౌక్యం,కరెంట్ తీగ చిత్రాలలో రకుల్ అందాలను ఆరబోసింది. దాంతో మాస్ ప్రేక్షకులు ఈ డిల్లీ భామ అందాలకు ఫీదా అయిపోయారు. తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం మాస్ ప్రేక్షకుల దగ్గర సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడుకు ఇక స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కోప్పలుగా వచ్చిపడతాయి అనడంలో ఏలాంటి డౌట్ అవసరం లేదు .

ఇప్పుడు సుబ్బారెడ్డి దర్శకత్వంలో సాయి కుమార్ తనయుడు ఆది సరసన ‘రఫ్’ మరియు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ‘పండగ చేస్కో’ సినిమాలో రామ్ సరసన రకుల్ నటిస్తుంది.

Exit mobile version