టాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువగా వర్కౌట్ లు అనగానే అందరికీ టఫీమని గుర్తుకువచ్చే పేరు రకుల్. ఈ అమ్మడు ఎక్కువ సేపు జిమ్‌లోనే కనిపిస్తుంటుంది. అందుకే సైడ్ బిజినెస్‌గా జిమ్ నిర్వహిస్తోంది. ఎల్లోరా శిల్పంలా, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఈ అమ్మడు చాలా ఫిట్‌గా ఉంటుంది. దాంతో రకుల్ డైట్ ఎలా ఉంటుందో? అలా ఉండడానికి ఏం చేయాలో అని అంతా భావిస్తారు. తాజాగా తన డైట్ సీక్రెట్‌ని బయట పెట్టింది. మీ డైట్ ఏంటి? అనే ప్రశ్న ఎదురవగా రకుల్ చాలా వింతగా స్పందించింది.
డైటా… నోరు కట్టేసుకుని డైట్ ఫాలో అయ్యే సీన్ లేదు నాకు, ఏది నచ్చితే అది తింటా, కానీ తినేటప్పుడు కొంత లిమిట్ ఉంటుంది, ఏది తిన్నా ఓ పద్దతి ప్రకరాం తింటాను, డైట్ పేరుతో నోరు కట్టేయడం నా వల్ల కాదు, మనకసలు డైట్ అనే ముచ్చటే మనకు నచ్చదు అంటూ చాల ఫన్నీగా చెప్పుకొచ్చింది. అంత ఫిట్‌గా ఉండే రకుల్ డైట్ ఫాలో అవకపోయిన భలే ఉందే అని అంతా షాకవుతున్నారు.