Site icon TeluguMirchi.com

పిక్‌టాక్‌ : రకుల్‌ ఏంటీ ఈ చెత్త డ్రస్‌

టాలీవుడ్‌లో రెండు సంవత్సరాల పాటు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ అమ్మడు ఆ రెండు సంవత్సరాల్లో దాదాపుగా అందరు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె సినీ కెరీర్‌ అంత సజావుగా అయితే లేదు. ఆమెకు ఆఫర్లే తక్కువ అయ్యాయి. వచ్చిన ఆఫర్లు కూడా ఆమెకు సక్సెస్‌ను తెచ్చి పెట్టలేక పోతున్నాయి. దాంతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మళ్లీ మునుపటి క్రేజ్‌ను దక్కించుకోవడం అసాధ్యంగా అనిపిస్తుంది.

ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా ధరించిన కాస్ట్యూమ్స్‌కు సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాస్ట్యూమ్స్‌ విషయంలో హీరోయిన్స్‌ చాలా శ్రద్ద కనబర్చాల్సి ఉంటుంది. ట్రెండీగా ఉండటంతో పాటు గ్లామర్‌గా చూపించే విధంగా ఉండాలి అదే విధంగా చూడ్డానికి చూడ ముచ్చటగా ఉండాలి. కాని ఈ డ్రస్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందంగా కనిపించడం లేదు, కనీసం డ్రస్‌ చూడముచ్చటగా ఉందా అంటే అదీ లేదు. అసలు రకుల్‌ ఇలాంటి డ్రస్‌ ఏంట్రా బాబోయ్‌ అంటున్నారు.

Exit mobile version