రకుల్ ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో నటించకపోయి ఉంటే లేదా ఆ సినిమా ఫలితం వేరే ఉండి ఉంటే ఖచ్చితంగా తాను ఈ పొజీషన్లో ఉండేదాన్ని కాదు. హీరోలకు రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత వారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. అయితే హీరోయిన్స్‌కు అలా కాదు. ఒక్కటి ఫ్లాప్ అయితే ఆమె కెరీర్ ఖతమే.
ముఖ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో సినిమాలు ఫ్లాప్ అయితే ఆమె కనిపించకుండా పోతుంది. అందుకే హీరోయిన్స్‌కు టాలీవుడ్లో హీరోల మద్య కంటే ఎక్కువ పోటీ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇంత పోటీని తట్టుకుని తాను ముందుకు వచ్చినందుకు గర్వంగా కూడా ఉందని చెప్పుకొచ్చింది.