హీరోలు ఫ్లాప్‌ అయినా పర్వాలేదు.. మేం ఫ్లాప్‌ అయితే !!

Rakul-@-3yrsటాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్‌ హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వెలుగు వెలిగి పోతుంది. ఈ అమ్మడు గత రెండు సంవత్సరాలుగా వరుసగా బడా హీరోలతో, స్టార్‌ హీరోలకు జోడీగా హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు పోతుంది. ప్రస్తుతం మహేష్‌బాబు సినిమాలో నటిస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను, హీరోయిన్స్‌ ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో నటించకపోయి ఉంటే లేదా ఆ సినిమా ఫలితం వేరే ఉండి ఉంటే ఖచ్చితంగా తాను ఈ పొజీషన్‌లో ఉండేదాన్ని కాదు. హీరోలకు రెండు మూడు సినిమాలు ఫ్లాప్‌ అయినా కూడా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత వారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. అయితే హీరోయిన్స్‌కు అలా కాదు. ఒక్కటి ఫ్లాప్‌ అయితే ఆమె కెరీర్‌ ఖతమే.

ముఖ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో సినిమాలు ఫ్లాప్‌ అయితే ఆమె కనిపించకుండా పోతుంది. అందుకే హీరోయిన్స్‌కు టాలీవుడ్‌లో హీరోల మద్య కంటే ఎక్కువ పోటీ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇంత పోటీని తట్టుకుని తాను ముందుకు వచ్చినందుకు గర్వంగా కూడా ఉందని చెప్పుకొచ్చింది.