ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి..మరో నాల్గు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖా తెలియజేయడం తో ప్రజలంతా భయం తో బిక్కు బిక్కుమంటున్నారు. ఈ వర్షాల ప్రభావం సాధారణ ప్రజలకే కాదు సినీ స్టార్స్ కు సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనమ్ కపూర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలు సాగుతున్నాయా అంటూ ముంబై మున్సిపాలిటీ, ముంబై పోలీస్, ఎయిర్పోర్ట్ వర్గాలకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌పై వెంటనే రకుల్ స్పదించి.. ‘గత రాత్రి నుంచి ఒక్క ఫ్లైట్ కూడా కదల్లేదు. నేను ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయాను’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రకుల్ తెలుగులో మన్మథుడు 2తో పాటు హిందీ, తమిళ భాషల్లో ఒక్కో సినిమాలో నటిస్తుంది.
Can anyone tell me if the airport is open? @mybmc @MumbaiPolice @BOMairport
— Sonam K Ahuja (@sonamakapoor) 2 July 2019