Site icon TeluguMirchi.com

రకుల్ సాయం అన్నదానం


రకుల్ పెద్ద మనసు చాటుకుంది. కరోనాతో దేశంలో నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో పేదవారికి తనవంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. గుడ్‌గావ్‌లోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ మురికివాడలోని కుటుంబాలకు రోజుకు రెండు పూటల ఆహారం పంపిణీ చేస్తుంది.

శనివారం నుంచి లాక్‌డౌన్‌ కాలం ముగిసేంత వరకు వీరికి ఇలానే ఆహారం పంపిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. కరోనా కారణంగా దేశంలో ఏర్పడిన సంక్షోభం కారణంగా చాలా మంది ప్రముఖులు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. రకుల్ తన వంతుగా ఈ సాయం చేసింది.

Exit mobile version