Site icon TeluguMirchi.com

తెలుగులోకి రకుల్-కార్తీ డబ్బింగ్

రకుల్ ఇప్పుడు సూపర్ ఫాం లో వుంది. వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. రకుల్ తమిళంలో హీరో కార్తీ సరసన ఓ సినిమా చేసింది. ధీరన్ అధికారం ఒండ్రు అనే ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ లు కుమ్మేసిన సినిమా ఇది. కార్తీ హోమ్ బ్యానర్ పై తయారయిందీ సినిమా.

ఈ సినిమాను ఇప్పడు తెలుగులోకి అనువదిస్తున్నారు. ఇప్పటివరకూ ఆడియో రంగంలో వున్న ఆదిత్య మ్యూజిక్ , నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తారు.

Exit mobile version