Site icon TeluguMirchi.com

మహేష్ తో మరోసారి ఛాన్స్ కొట్టేసిన రకుల్..

rakul-role-spyder

ప్రస్తుతం మహేష్ బాబు తో స్పైడర్ మూవీ లో నటిస్తున్న రకుల్ ప్రీతి సింగ్..మరోసారి మహేష్ తో జోడి కట్టే ఛాన్స్ కొట్టినట్లు సమాచారం. స్పైడర్ తర్వాత మహేష్ కొరటాల శివ దర్శకత్వం లో “భరత్ అను నేను” అనే మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబదించిన ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తిచేసిన కొరటాల.. ప్రస్తుతం నటీనటుల ఎంపికలో ఉన్నాడు.

మొదటగా ఈ మూవీ లో శ్రీమంతుడు మూవీ లో మహేష్ జత కట్టిన శృతి హాసన్ ను అనుకున్నారు..కానీ రీసెంట్ గా శృతిహాసన్ చేసిన కాటమరాయుడు సినిమాలో ఆమె లుక్స్ పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పునరాలోచనలో పడిన కొరటాల.. శృతి స్థానంలో రకుల్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. దీనికి సంబదించిన ప్రకటన అతి త్వరలో రానుందని తెలుస్తుంది.

ఫస్ట్ షెడ్యూల్ లండన్ లో ప్లాన్ చేశారు. 10 రోజుల పాటు లండన్ లో షూట్ చేసిన తర్వాత మిగతా భాగాన్ని హైదరాబాద్ లో కంప్లీట్ చేస్తారు.

Exit mobile version